వర్మ 'పవర్ స్టార్' నుండి వరుస ఫొటోలు.. తాజాగా అన్నదమ్ముల కాంబినేషన్ విడుదల.. ఫొటోలు ఇవిగో!

09-07-2020 Thu 20:31
  • వరుస ఫొటోలను విడుదల చేస్తున్న వర్మ
  • అచ్చుగుద్దినట్టు కొందరిని పోలిన ఫొటోలు
  • 'పవర్ స్టార్' వివాదాస్పదం అయ్యే అవకాశం
RGV Releases photos of Power Star movie

'పవర్ స్టార్' సినిమా పేరును రామ్ గోపాల్ వర్మ ప్రకటించిన వెంటనే కలకలం రేగింది. ఈ చిత్రాన్ని ఎవరిని ఉద్దేశించి తీస్తున్నారో అందరికీ క్షణకాలంలోనే అర్థమైంది. అందరూ ఊహించినట్టుగానే... సినిమా ప్రమోషన్ ను తనదైన శైలిలో, వివాదాస్పద దారిలో వర్మ తీసుకెళ్తున్నారు. ట్విట్టర్ లో వరుసబెట్టి ఫొటోలను షేర్ చేస్తూ అందరి దృష్టిని ఈ సినిమాపైకి లాగేస్తున్నారు. సినిమాకు సంబంధించి వర్మ షేర్ చేస్తున్న ఫొటోలు అచ్చుగుద్దినట్టు కొందరిని పోలి ఉన్నాయి. రాబోయే రోజుల్లో ఈ చిత్రం ఏ స్థాయిలో వివాదాలకు కారణమవుతుందో  అనే చర్చ జరుగుతోంది. మరో వైపు ఫొటోలకు వర్మ కామెంట్లు కూడా పెట్టారు. ఫొటోలు, కామెంట్లను కింద చూడండి.