సైన్యాలు వెనక్కి మళ్లుతున్నాయి.. శుభపరిణామం: చైనా

09-07-2020 Thu 18:21
  • ఉద్రిక్త పరిస్థితులు తగ్గుముఖం పడుతున్నాయి
  • రానున్న రోజుల్లో పరిస్థితులు మరింత మెరుగుపడతాయి
  • భారత్ తో ప్రభుత్వ స్థాయిలో కూడా చర్చలను నిర్వహించబోతున్నాం
Troops are getting back both sides says China

గాల్వాన్ లోయలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయని చైనా విదేశాంగ శాఖ తెలిపింది. ఇరు దేశాలకు చెందిన సైనికులు ఉద్రిక్త ప్రాంతం నుంచి వెనక్కి వేగంగా మరలుతున్నారని... ఇది శుభపరిణామమని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఝావ్ లిజియాన్ అన్నారు. రానున్న రోజుల్లో పరిస్థితులు మరింత మెరుగుపడతాయని తెలిపారు. భారత్ తో మరిన్ని చర్చలను నిర్వహిస్తామని... సైనికపరమైన చర్చలే కాకుండా, ప్రభుత్వ స్థాయిలో కూడా చర్చలను నిర్వహించబోతున్నామని తెలిపారు. చర్చల ద్వారా సాధించిన పరిష్కారాన్ని అమలు చేయడంలో భారత్ సహకరిస్తుందని ఆశిస్తున్నామని చెప్పారు.