Shriya: ప్రభాస్ పై అభిమానాన్ని వ్యక్తపరిచిన శ్రియ

Shriya praises Prabhas
  • పెళ్లి చేసుకున్న తర్వాత కూడా సినిమాలతో బిజీగా ఉన్న శ్రియ
  • సోషల్ మీడియా ద్వారా అభిమానులతో చిట్ చాట్
  • 'ఆర్ఆర్ఆర్' యూనిట్ తో కలవాలని ఎదురుచూస్తున్నానని వ్యాఖ్య
టాలీవుడ్ లో ఎక్కువ కాలం సక్సెస్ ఫుల్ నటిగా కొనసాగిన వారిలో శ్రియ ఒకరు. దాదాపు దశాబ్ద కాలం పాటు అగ్రనటిగా ఆమె కొనసాగారు. రష్యన్ వ్యక్తిని ప్రేమించి పెళ్లాడిన శ్రియ... ఆ తర్వాత కూడా క్రమం తప్పకుండా తెలుగు చిత్రాల్లో నటిస్తూనే ఉన్నారు. తాజాగా సోషల్ మీడియా ద్వారా తన అభిమానులతో ఆమె చిట్ చాట్ చేశారు. ఈ సందర్భంగా పలు ప్రశ్నలకు ఆమె ఆసక్తికర సమాధానాలను ఇచ్చారు.

రాజమౌళి, జూనియర్ ఎన్టీఆర్, రాంచరణ్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న 'ఆర్ఆర్ఆర్' సినిమా గురించి ఆమె స్పందించారు. ఆ సినిమా యూనిట్ తో జాయిన్ అయ్యేందుకు ఎదురు చూస్తున్నానని చెప్పారు. 'ఆర్ఆర్ఆర్' చిత్రంలో అజయ్ దేవగణ్ భార్య పాత్రలో శ్రియ కనిపిస్తున్నట్టు సమాచారం. మరోవైపు ప్రభాస్ పై తనకున్న అభిమానాన్ని కూడా శ్రియ వ్యక్తపరిచారు. మంచి యాక్టరే కాకుండా, మంచి స్నేహితుడని కితాబిచ్చారు. ప్రభాస్ కళ్లు మంత్రముగ్ధుల్ని చేస్తాయని కొనియాడారు.
Shriya
Prabhas
RRR
Tollywood

More Telugu News