Swamy Prabodhananda: త్రైత సిద్ధాంత కర్త స్వామి ప్రబోధానంద కన్నుమూత

  • తాడిపత్రిలో కన్నుమూసిన ప్రబోధానంద
  • ఆశ్రమం నుంచి ఆసుపత్రికి తరలిస్తుండగా కన్నుమూత
  • తొలుత భారత సైన్యంలో పని చేసిన ప్రబోధానంద
Swamy Prabodhananda dies

అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఆధ్యాత్మిక గురువు స్వామి ప్రబోధానంద కన్నుమూశారు. అనారోగ్య కారణాలతో ఆయన తుదిశ్వాస విడిచారు. ఆశ్రమం నుంచి ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందారు.

1950లో తాడిపత్రి మండలంలోని అమ్మలదిన్నె కొత్తపల్లె అనే గ్రామంలో ఆయన జన్మించారు. ఆయన అసలు పేరు పెద్దన్న చౌదరి. తొలుత భారత సైన్యంలో వైర్ లెస్ ఆపరేటర్ గా ఆయన పని చేశారు. సైన్యం నుంచి తిరిగి వచ్చిన తర్వాత తాడిపత్రిలో కొన్ని రోజులు ఆర్ఎంపీ డాక్టర్ గా సేవలందించారు. వైద్యుడిగా సేవలందిస్తూనే ఆయుర్వేదంపై పుస్తకాన్ని రచించారు. ఇదే సమయంలో ఆధ్యాత్మిక అంశాలపై కూడా గ్రంథాలను రచించారు. అనంతరం ఆధ్యాత్మిక గురువుగా మారారు.

తాడిపత్రి సమీపంలోని చిన్నపొడమల గ్రామంలో శ్రీకృష్ణమందిరం పేరుతో ఆశ్రమాన్ని నెలకొల్పారు. ఈయన త్రైత సిద్ధాంతాన్ని బోధించేవారు. భగవద్గీత, బైబిల్, ఖురాన్ లలో ఉన్న దైవజ్ఞానం ఒక్కటేననేదే ఈ సిద్ధాంతం. ప్రబోధానంద మరణవార్తతో ఆయన భక్తులు కన్నీరుమున్నీరవుతున్నారు.

More Telugu News