కొవిడ్ రోగులకు ఇన్ హేలర్ ను తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు ప్రారంభం

09-07-2020 Thu 15:34
  • ప్రయోగాలను ప్రారంభించిన గిలీడ్ సైన్సెస్
  • ప్రయోగాలకు 60 మంది ఎంపిక
  • నెబులైజర్ సాయంతో రోగికి మందు ఇచ్చే వెసులుబాటు
Gilead is trying to bring inhaler for corona

కరోనా వైరస్ అత్యవసర చికిత్సలో ప్రస్తుతం రెమిడెసివిర్ అనే మందును వినియోగిస్తున్న సంగతి  తెలిసిందే. ఈ రెమిడెసివిర్ ను సరికొత్త రూపంలో తీసుకొచ్చేందుకు గిలీడ్ సైన్సెస్ ప్రయత్నాలను ప్రారంభించింది. ఇప్పటి వరకు ఇంజెక్షన్ రూపంలో ఇస్తున్న ఈ మందును ఇన్ హేలర్ రూపంలో తీసుకొచ్చేందుకు పరీక్షలను ప్రారంభించింది.

ఈ సందర్భంగా గిలీడ్ సైన్సెస్ ప్రతినిధి మాట్లాడుతూ 18 నుంచి 45 ఏళ్ల వయసు ఉన్న 60 మందిని ప్రయోగాలకు ఎంపిక చేసినట్టు తెలిపారు. ఈ ప్రయోగం ఫలిస్తే కరోనా రోగులు ఆసుపత్రులకు వెళ్లాల్సిన అవసరం ఉండదని చెప్పారు. నెబులైజర్ సాయంతో ఈ మందును రోగికి ఇస్తారని తెలిపారు. ఇన్ఫెక్షన్ సోకిన భాగంలోనే తొలుత నయం చేసే అవకాశం ఉంటుందని చెప్పారు. ఈ మందు మార్కెట్లోకి వస్తే రోగులకు ఎంతో మేలు జరిగే అవకాశం ఉంది.