Ram Gopal Varma: 'పవర్ స్టార్' నుండి మరో పోస్టర్ విడుదల చేసిన వర్మ

RGV releases new poster from Power Star movie
  • వివాదాస్పద అంశంతో 'పవర్ స్టార్' చిత్రం
  • ఎవరినీ ఉద్దేశించి తీస్తున్నది కాదని చెపుతున్న వర్మ
  • పోస్టర్ చూడగానే గుర్తుకొస్తున్న ప్రధాన పాత్ర
కరోనా సమయంలో టాలీవుడ్ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ స్పీడు పెంచారు. ఇప్పటికే వరుసగా అడల్ట్ కంటెంట్ సినిమాలను ఆన్ లైన్లో విడుదల చేస్తూ సంచలనం రేపిన వర్మ... ఇప్పుడు తాజాగా ఓ వివాదాస్పద కథాంశం ఆధారంగా చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.

 'పవర్ స్టార్' పేరుతో తీస్తున్న సినిమాకు సంబంధించి అప్పుడే ప్రమోషన్ ను తనదైన శైలిలో ప్రారంభించారు. ఈ చిత్రం ఎవరినీ ఉద్దేశించి తీస్తున్నది కాదని వర్మ చెపుతున్నప్పటికీ... ఎవరిని ఉద్దేశించి తీస్తున్నారో పోస్టర్ ను చూడగానే ఎవరికైనా అర్థమవుతుంది. 'పవర్ స్టార్' టైటిల్ మధ్యలో ఓ రాజకీయ పార్టీకి చెందిన గుర్తు గాజు గ్లాసును కూడా పెట్టారు.

తాజాగా ఈ సినిమాలోని ప్రధాన పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ ను వర్మ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన చేసిన ట్వీట్ ఆసక్తికరంగా ఉంది. ''పవర్ స్టార్'లో ప్రధాన పాత్రను పోషిస్తున్న యాక్టర్ నేను చూసిన ప్రతి స్టార్ కన్నా పవర్ ఫుల్' అని కామెంట్ చేశారు.
Ram Gopal Varma
Power Star Movie
Tollywood

More Telugu News