అమరావతిలో అయోధ్య తరహా రామాలయ నిర్మాణానికి రూ.10,01,116 విరాళమిస్తున్నాను: సుజనాచౌదరి

09-07-2020 Thu 13:31
  • అఖిల భారత హిందూ మహాసభ ఆధ్వర్యంలో నిర్మాణం 
  • రామాలయం నిర్మిస్తామని ఇప్పటికే ప్రకటన
  • అమరావతి ఆధ్యాత్మిక నగరంగా శోభిల్లుతుంది
sujana give fund for ramalayam

ఆంధ్రప్రదేశ్‌లోని అమరావతిలో దక్షిణ భారత రామాలయాన్ని నిర్మిస్తామని అఖిల భారత హిందూ మహాసభ అధ్యక్షుడు చక్రపాణి మహారాజ్ ఇటీవల ప్రకటించారు. అమరావతి దక్షిణ భారత దేశానికి అయోధ్యవంటిదని ఆయన అన్నారు. అలాగే, ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో రామ మందిర నిర్మాణం ఎలా జరుగుతుందో అదే రీతిలో అమరావతిలోనూ దక్షిణ భారత రామాలయం నిర్మిస్తామని అమరావతి జేఏసీ గౌరవ చైర్మన్‌ జీవీఆర్‌ శాస్త్రి కూడా ఇటీవల ప్రకటించారు.

వీటిపై బీజేపీ నేత  సుజనా చౌదరి స్పందిస్తూ.. 'ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో అఖిల భారత హిందూ మహాసభ... అయోధ్య తరహాలో దక్షిణ భారత రామాలయాన్ని నిర్మిస్తామని ప్రకటించడాన్ని ఆహ్వానిస్తున్నాను. రామాలయం నిర్మాణం వల్ల మన రాజధాని అమరావతి ఆధ్యాత్మిక నగరంగా శోభిల్లుతుంది. ఆలయ నిర్మాణానికి నా వంతుగా రూ.10,01,116 విరాళం ప్రకటిస్తున్నాను' అని తెలిపారు.