India: దేశంలో కరోనా డేంజర్ బెల్స్.. అమెరికా, బ్రెజిల్‌ను దాటేసిన వైరస్ వృద్ధిరేటు

  • అగ్రస్థానంలో ఉన్న అమెరికాలో ఇది 1.8 శాతం మాత్రమే
  • భారత్‌లో మాత్రం 3.5 శాతం వృద్ధి రేటు
  • రెండు వారాల క్రితం తగ్గి మళ్లీ పెరిగిన కేసుల వృద్ధి రేటు
India crossed America and Brazil in corona cases growth rate

అమెరికా, బ్రెజిల్ దేశాలను గడగడలాడిస్తున్న కరోనా మహమ్మారి ఇప్పుడు భారత్‌లో శరవేగంగా వ్యాప్తి చెందుతూ ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. కరోనా కేసుల్లో అగ్రస్థానంలో ఉన్న ఆ రెండు దేశాల కంటే భారత్‌లోనే కేసుల వృద్ధి రేటు అధికంగా ఉంది.

అమెరికాలో గత వారం రోజుకు సగటున 1.8 శాతం మేర కేసుల్లో వృద్ధి నమోదు కాగా, రెండో స్థానంలో ఉన్న బ్రెజిల్‌లో ఇది 2.7 శాతంగా ఉంది. నాలుగో స్థానంలో ఉన్న రష్యాలో ఒకశాతం, ఐదో స్థానంలో ఉన్న పెరులో 1.2 శాతం నమోదు కాగా, అత్యధిక కేసుల జాబితాలో మూడో స్థానంలో ఉన్న మన దేశంలో మాత్రం ఇది 3.5 శాతంగా ఉండడం ఆందోళన కలిగిస్తోంది. ప్రస్తుతం దేశంలో సగటున వారానికి 1.14 శాతం మంది కరోనా బారినపడుతుండగా, నెల రోజుల క్రితం ఇది 1.21 శాతంగా ఉంది. అయితే, రెండు వారాల క్రితం 1.12 తగ్గినా మళ్లీ అమాంతం పెరిగింది.

More Telugu News