హీరోయిన్‌ శ్రియతో తాను క్లోజ్‌గా వున్న ఫొటోను షేర్ చేసిన నిర్మాత.. వివాదాస్పద వ్యాఖ్యలు!

Thu, Jul 09, 2020, 02:55 PM
TANUJJ GARG share controversial image
  • ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీస్‌లో పోస్ట్  
  • బాలీవుడ్ నిర్మాత తనూజ్ గార్గ్ పై విమర్శలు
  • లండన్‌లో ఓ రాత్రి ఈ ఫొటో తీసుకున్నట్లు తెలిపిన నిర్మాత
హీరోయిన్ శ్రియతో గతంలో దిగిన ఓ ఫొటోను బాలీవుడ్ నిర్మాత తనూజ్ గార్గ్ తన ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీస్‌లో పోస్ట్ చేశారు. తాగిన మత్తులో గతంలో లండన్‌లో ఓ రాత్రి ఈ ఫొటో తీసుకున్నట్లు తెలిపారు. శ్రియ భుజంపై చేయి వేసిన తీరుతో ఆయన ఇందులో కనపడుతున్నారు. ఈ ఫొటో స్క్రీన్ షాట్ తీసి పెట్టుకున్న నెటిజన్లు ఆసక్తికర కామెంట్లు చేస్తున్నారు. తనూజ్ పోస్ట్ చేసిన ఈ ఫొటో సామాజిక మాధ్యమాల్లో బాగా వైరల్ అవుతోంది. ‌
 
చిరంజీవితో పాటు టాలీవుడ్‌ అగ్రహీరోలందరితోనూ నటించిన శ్రియ ప్రస్తుతం సినిమాలు తగ్గించిన విషయం తెలిసిందే. రష్యాకు చెందిన ఆండ్రీ కొస్చీవ్‌ను శ్రియ వివాహం చేసుకుని సెటిలైంది. ఈ నేపథ్యంలో తనూజ్ గార్గ్ పోస్ట్ చేసిన ఈ ఫొటో వివాదాస్పదమవుతోంది.  శ్రియతో చాలా క్లోజ్‌గా ఉన్న సమయంలో తీసుకున్న ఈ ఫొటోను పోస్ట్ చేయడమే కాకుండా మద్యం తాగి ఎంజాయ్ చేసిన రాత్రంటూ ఆయన కామెంట్ చేయడం హాట్‌ టాపిక్‌గా మారింది.
X

Feedback Form

I agree to Terms of Service & Privacy Policy
Do you hate Fake News, Misleading Titles, Cooked up Stories and Cheap Analyses?...
We are here for YOU: Team ap7am.com
GarudaVega Banner Ad