Nagarjuna: 'బిగ్ బాస్'కి నాగార్జున పారితోషికం ఎంత?

Nagarjunas remuneration for Bigg Boss show discussed
  • రియాలిటీ షోలలో బిగ్ బాస్ షోకి మంచి టీఆర్పీ 
  • నాలుగో సీజన్ కి కూడా హోస్టుగా నాగార్జున
  • గతంలో 30 ఎపిసోడ్లకి 5 కోట్లు తీసుకున్న నాగ్
టీవీ రియాలిటీ షోలలో బిగ్ బాస్ షోకి వున్న క్రేజే వేరు. ఇందులో పలువురు సెలబ్రిటీలు పాల్గొనడం.. ఆసక్తికరమైన టాస్క్ లు చేయడం.. స్టార్ హీరో ఎవరో ఒకరు హోస్ట్ గా వ్యవహరించడం వల్ల ఈ షోకి విపరీతమైన ఆదరణ వచ్చింది. అందుకే, టీఆర్పీ కూడా దీనికి అదిరిపోతుంది.

తెలుగులో మొదటి షోకి ఎన్టీఆర్, రెండో షోకి నాని, మూడో షోకి నాగార్జున హోస్ట్ చేశారు. ఇక ఇప్పుడు నాలుగో షోకి కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఓపక్క పార్టిసిపేంట్ల ఎంపిక చకచకా జరుగుతోంది. మరోపక్క, హోస్ట్ గా అక్కినేని నాగార్జున ఈ సీజన్ కి కూడా ఎంపిక అయినట్టు చెబుతున్నారు. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రానుంది.

ఇక ఈ షోకి హోస్ట్ గా వ్యవహరించే నాగార్జునకు ప్రస్తుత పరిస్థితులను బట్టి పారితోషికం తక్కువ ఇస్తున్నట్టు ఇటీవల ప్రచారం జరిగింది. అయితే, ఆ ప్రచారంలో వాస్తవం లేదనీ, మూడో సీజన్ కి ఆయనకు ఎంత ఇవ్వడం జరిగిందో ఇంచుమించు ఈ సీజన్ కి కూడా అంతే మొత్తంలో పారితోషికం ఇస్తున్నారని తాజా సమాచారం. మూడో సీజన్ కి నాగార్జున 30 ఎపిసోడ్లకు కలిపి సుమారు 5 కోట్ల వరకు తీసుకున్నట్టు అప్పట్లో వార్తలొచ్చాయి.
Nagarjuna
Bigg Boss
Jr NTR
Nani

More Telugu News