raghurama krishnaraju: రఘురామకృష్ణరాజుపై భీమవరం పోలీసులకు ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్‌ ఫిర్యాదు

gandi srinivas gives complaint against raghuramakrishnaraju
  • నాతో పాటు సహచర ఎమ్మెల్యేలపై అనుచిత వ్యాఖ్యలు
  • మమ్మల్ని రఘురామకృష్ణరాజు 'పందులు' అని అన్నారు
  • నా పరువుకు నష్టం వాటిల్లేలా వ్యాఖ్యలు చేశారు
  • రఘురామకృష్ణరాజుపై చర్యలు తీసుకోవాలి
వైసీపీ అసంతృప్త ఎంపీ రఘురామకృష్ణరాజు తనపై అసత్య ప్రచారం చేస్తున్నారంటూ ఏపీ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథ రాజు ఇప్పటికే పశ్చిమ గోదావరి జిల్లా పోడూరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ రోజు రఘురామకృష్ణరాజుపై భీమవరం వన్ టౌన్ పోలీస్‌ స్టేషన్‌లో వైసీపీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ కూడా ఫిర్యాదు చేశారు.

తనతో పాటు తన పార్టీ సహచర ఎమ్మెల్యేలను రఘురామకృష్ణరాజు 'పందులు' అంటూ అనుచితంగా వ్యాఖ్యలు చేశారని చెప్పారు. తన పరువుకు నష్టం వాటిల్లేలా వ్యాఖ్యలు చేసిన రఘురామకృష్ణరాజుపై చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. తమ పార్టీలో వర్గ వైషమ్యాలు రెచ్చగొట్టేలా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయని చెప్పారు. అలాగే, శాంతి భద్రతలకు విఘాతం కలిగేలా రఘురామకృష్ణరాజు తీరు ఉందని ఆరోపించారు.  
raghurama krishnaraju
YSRCP
Andhra Pradesh

More Telugu News