Bollywood: బాలీవుడ్ అలనాటి హాస్యనటుడు జగదీప్ కన్నుమూత

Bollywood veteran actor Jagdeep died last night
  • వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న జగదీప్
  • కాసేపట్లో ముంబైలో అంత్యక్రియలు
  • శోక సంద్రంలో బాలీవుడ్
బాలీవుడ్‌కు చెందిన అలనాటి హాస్యనటుడు జగదీప్ అలియాస్ సయ్యద్ ఇష్తియాక్ అహ్మద్ జాఫ్రీ (81) గత రాత్రి కన్నుమూశారు. వృద్ధాప్య సమస్యతో బాధపడుతున్న ఆయన నిన్న రాత్రి 8.40 గంటలకు తుది శ్వాస విడిచినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. ముంబైలోని షియా ఖబర్‌స్తాన్‌లో ఆయన అంత్యక్రియలు కాసేపట్లో నిర్వహించనున్నారు. జగదీప్‌కు ఇద్దరు కుమారులు జావేద్ జాఫ్రీ, నవేద్ జాఫ్రీలు ఉన్నారు.

జగదీప్ మృతికి ప్రముఖ కమెడియన్ జాన్ లీవర్ సంతాపం తెలిపారు. తన మొదటి సినిమా ‘యే రిసితా నా టూటే’లో దిగ్గజ నటుడైన జగదీప్‌తో కలిసి నటించినట్టు పేర్కొన్నారు. ‘జగదీప్ భాయ్ వియ్ మిస్ యూ’ అని ఆయన ఫొటోతో ట్వీట్ చేశారు. బాలీవుడ్‌లో దాదాపు 400కుపైగా సినిమాల్లో నటించిన జగదీప్ ‘షోలే’ సినిమాలో సూర్యభోపాలి పాత్రను పోషించారు. ఆ తర్వాత అదే పేరు ‘సూర్య భోపాలి’ సినిమాకు స్వయంగా దర్శకత్వం వహించి దర్శకుడిగా మారారు. కాగా, ఆయన మరణవార్త తెలిసి బాలీవుడ్ శోక సంద్రంలో మునిగిపోయింది.
Bollywood
Comedian
jagdeep
died

More Telugu News