బాబు ఎక్కడ హర్ట్ అవుతాడో అని కన్నా సైలెంటయ్యాడు: విజయసాయిరెడ్డి ఎద్దేవా

09-07-2020 Thu 09:37
  • నిర్మాణం పూర్తి కాని ఇళ్లను పంపిణీ చేయట్లేదని టీడీపీ ఆందోళన
  • బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు గారు వారిని కడిగి పారేశారు
  • ‘విజనరీ’ చీకటి మిత్రులకూ టెన్షన్ పట్టుకుంది
  • దొంగే దొంగ, దొంగ అని అరిచినట్టు నిరసన దీక్షలు చేస్తారట
vijaya sai reddy fires on chandra babu naidu

టీడీపీ నేతలపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. ఇళ్ల స్థలాల పంపిణీ విషయంలో రాద్ధాంతం చేస్తున్నారని ఆరోపించారు. 'నిర్మాణం పూర్తి కాని ఇళ్లను పంపిణీ చేయట్లేదని పచ్చ పార్టీ ఆందోళనకు దిగడంపై బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు గారు కడిగి పారేశారు. బాబు ఎక్కడ హర్ట్ అవుతాడో అని కన్నా సైలెంటయ్యాడు. 30 లక్షల పట్టాలు సిద్ధమైనప్పటి నుంచి ‘విజనరీ’ చీకటి మిత్రులకూ టెన్షన్ పట్టుకుంది' అని విమర్శలు గుప్పించారు.

'ఇళ్ల స్థలాల పంపిణీని అడ్డుకుని పేదలపై పగ సాధించడమే కాకుండా దొంగే దొంగ, దొంగ అని అరిచినట్టు నిరసన దీక్షలు చేస్తారట టీడీపీ(తెలుగు దొంగల పార్టీ)నేతలు. పట్టాల పంపిణీ వాయిదా వేయకుండా తక్షణమే అందజేయాలని డిమాండు.అడ్డుకునేది మీరే. ఇవ్వాలని అడిగేది మీరే. మరీ ఇంత సిగ్గు విడిచి రాజకీయం చేయాలా' అని విజయసాయిరెడ్డి విమర్శించారు.