కరోనాతో మృతి చెందిన ‘ఈ రోజుల్లో’ హీరో శ్రీ తండ్రి

09-07-2020 Thu 09:21
  • టాలీవుడ్‌ను కలవరపెడుతున్న మహమ్మారి వైరస్
  • 20 రోజులుగా విజయవాడలోని ఆసుపత్రిలో చికిత్స
  • పలువురు బుల్లితెర నటులు కూడా
tollywood actor sree father died with corona

టాలీవుడ్‌లో కరోనా వైరస్ కలకలం సృష్టిస్తోంది. కరోనా బారినపడిన నిర్మాత పోకూరి రామారావు ఇటీవల కరోనాతో మృతి చెందగా తాజాగా, టాలీవుడ్ నటుడు, ‘ఈ రోజుల్లో’ ఫేం హీరో శ్రీ తండ్రి మంగం వెంకట దుర్గా రాంప్రసాద్ కరోనాతో కన్నుమూశారు. విజయవాడలోని ఓ ఆసుపత్రిలో గత 20 రోజులుగా చికిత్స పొందుతున్న ఆయన గత రాత్రి 8:30 గంటల సమయంలో తుదిశ్వాస విడిచారు.

మారుతి తొలిసారి డైరెక్ట్ చేసిన ‘ఈ రోజుల్లో’ సినిమాతో శ్రీ హీరోగా తెలుగు తెరకు పరిచయమయ్యాడు. ఆ తర్వాత ‘లవ్ సైకిల్’, ‘పుస్తకంలో కొన్ని పేజీలు మిస్సింగ్’ తదితర సినిమాల్లో శ్రీ నటించాడు. మరోవైపు, బుల్లితెర నటులు కూడా కరోనా మహమ్మారి బారినపడుతున్నారు. రవికృష్ణ, రాజశేఖర్, సాక్షి శివ, సీరియల్ నటి నవ్యస్వామి వైరస్ బారినపడ్డారు.