Atchannaidu: గుంటూరు రమేశ్ ఆసుపత్రికి అచ్చెన్నాయుడి తరలింపు

Atchannaidu will be treated in Guntur Ramesh hospital
  • విజయవాడ్ సబ్ జైలు నుంచి గుంటూరు తీసుకువచ్చిన పోలీసులు
  • ఈఎస్ఐ స్కాంలో రిమాండ్ లో ఉన్న అచ్చెన్న
  • అచ్చెన్న పిటిషన్ పై అనుకూల తీర్పు ఇచ్చిన హైకోర్టు
ఈఎస్ఐ కొనుగోళ్ల వ్యవహారం కేసులో రిమాండ్ లో ఉన్న టీడీపీ నేత అచ్చెన్నాయుడ్ని ప్రైవేటు ఆసుపత్రికి తరలించాలంటూ హైకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో విజయవాడ సబ్ జైలులో ఉన్న అచ్చెన్నాయుడ్ని గుంటూరులోని రమేశ్ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఇటీవల ఈఎస్ఐ స్కాంలో ఆయనను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు.

అయితే అప్పటికే ఆయనకు శస్త్రచికిత్స జరగడంతో ఆ గాయం మళ్లీ తిరగబెట్టింది. దాంతో గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో మరోసారి శస్త్రచికిత్స చేయాల్సి వచ్చింది. ఏసీబీ అధికారులు సైతం అచ్చెన్నను గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలోనే విచారించారు. అపై ఆయనను ఆసుపత్రి నుంచి డిశ్చార్జి చేశారు. తాను ఇప్పటికీ అనారోగ్యంతో బాధపడుతున్నానని, మెరుగైన చికిత్స కోసం ప్రైవేటు ఆసుపత్రికి తరలించాలని అచ్చెన్న హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా, హైకోర్టు సానుకూలంగా తీర్పు ఇచ్చింది.
Atchannaidu
Treatment
Ramesh Hospital
Guntur
ESI Scam

More Telugu News