ఆ ఆడియో క్లిప్పింగ్ ఫేక్.. నాకేం కాలేదు: తెలంగాణ డిప్యూటీ స్పీకర్ పద్మారావు

08-07-2020 Wed 19:28
  • తెలంగాణ డిప్యూటీ స్పీకర్ కు కరోనా
  • హోం క్వారంటైన్ లో ఉన్న పద్మారావు
  • వాట్సాప్ లో వైరల్ అవుతున్న క్లిప్పింగ్ పై వివరణ
Padmarao clarifies about his health

తెలంగాణ డిప్యూటీ స్పీకర్ టి.పద్మారావు కరోనా బారినపడిన సంగతి తెలిసిందే. అయితే, తన గురించి ఓ ఆడియో క్లిప్పింగ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోందని, దాన్ని నమ్మవద్దని పద్మారావు స్పష్టం చేశారు. వాట్సాప్ లోనూ ఇతర, సామాజిక వేదికల్లో సర్క్యులేట్ అవుతున్న ఆ క్లిప్పింగ్ లో నిజంలేదని, అది వట్టి ఫేక్ ఆడియో అని వివరించారు. ప్రస్తుతం తాను హోం క్వారంటైన్ లో ఉన్నానని, ఆరోగ్యంగానే వున్నానని తెలిపారు. తన క్షేమం కోసం ప్రార్థిస్తున్న వారందరికీ ధన్యవాదాలు అంటూ ట్వీట్ చేశారు.