Chidambaram: చైనా బలగాలు ఎక్కడి నుంచి ఖాళీ చేశాయి... ఎక్కడికి వెళ్లాయి? ఎవరైనా చెబుతారా?: చిదంబరం

  • ఎల్ఏసీ నుంచి వెనక్కి మళ్లిన చైనా సైన్యం
  • కేంద్రం వివరాలు చెప్పాలన్న చిదంబరం
  • జవాబుల కోసం భారతీయులు తహతహలాడిపోతున్నారని వ్యాఖ్యలు
Chidambaram asks Centre to reveal what happened at border

గాల్వన్ లోయలోని సమస్యాత్మక ప్రాంతం నుంచి చైనా బలగాలు వెనక్కి వెళ్లినట్టు మీడియాలో వార్తలు వస్తున్నాయి. దీనిపై కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం తనదైన  శైలిలో స్పందించారు. చైనా బలగాలు వెనక్కి వెళ్లాయన్న దానిపై వివరాలు తెలుసుకోవాలనుకుంటున్నానని పేర్కొన్నారు.

"చైనా బలగాలు వెనక్కి మరలడాన్ని స్వాగతిస్తున్నాను. అయితే, ఏ ప్రదేశం నుంచి చైనా వెనక్కి వెళ్లింది... ఇప్పుడు ఎక్కడికి వెళ్లింది? ఈ వివరాలను నాకు ఎవరైనా చెబుతారా?" అని అడిగారు. ఈ వివరాలను తాను కేంద్రం నోట వినాలనుకుంటున్నానని చిదంబరం వ్యాఖ్యానించారు.

"ఒకవేళ మన దళాలు కూడా వెనక్కి మరలాయనుకుంటే అది ఎక్కడ్నించి? చైనా వెనక్కి మరలిన ప్రాంతం నుంచే భారత బలగాలు కూడా వెనక్కి మరలాయా? లేక, భారత బలగాలు కానీ, చైనా బలగాలు కానీ ఎల్ఏసీకి అట్నుంచి ఇటో, ఇట్నుంచి అటో వెళ్లాయా? నాకు ఈ ప్రశ్నలన్నింటికి జవాబులు కావాలి. అసలు జూన్ 15న ఏం జరిగిందన్న దానిపై భారతీయులందరూ తహతహలాడిపోతున్నారు" అంటూ చిదంబరం ట్విట్టర్ లో పేర్కొన్నారు.

More Telugu News