Prabhas: ప్రభాస్ కొత్త సినిమాకు సంబంధించి బిగ్ అనౌన్స్ మెంట్!

Big announcement from Prabhas 20th movie
  • విడుదలకు సిద్ధమవుతున్న ప్రభాస్ 20వ చిత్రం
  • 10 తేదీన టైటిల్, ఫస్ట్ లుక్ విడుదల
  • ప్రభాస్ సరసన సందడి చేయనున్న పూజా హెగ్డే
ప్రభాస్ అభిమానులకు గుడ్ న్యూస్. ఆయన 20వ చిత్రానికి సంబంధించి అప్ డేట్స్ కోసం ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ కోసం చిత్ర యూనిట్ శుభవార్తను అందించింది. ఈనెల 10వ తేదీ ఉదయం 10 గంటలకు సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ ను విడుదల చేయనున్నట్టు యూవీ క్రియేషన్స్ ప్రకటించింది. తమ అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా ఈ విషయాన్ని వెల్లడించింది. ఈ చిత్రంలో ప్రభాస్ సరసన పూజా హెగ్డే నటిస్తోంది. 'జిల్' సినిమా దర్శకుడు రాధా కృష్ణకుమార్ దీన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి 'రాధేశ్యామ్' అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్టు సమాచారం.  
Prabhas
Pooja Hegde
New Movie
Tollywood

More Telugu News