ఏంటి కన్నా... టీడీపీ మిడతల దండు బీజేపీపై వాలిందని మేం అలర్ట్ చేస్తే తప్పా?: విజయసాయిరెడ్డి

08-07-2020 Wed 14:05
  • విజయసాయి వ్యాఖ్యలపై సీఎం జగన్ కు లేఖరాసిన కన్నా
  • విజయసాయి కౌంటర్
  • మీరూ ఆ పసుపు దండులో భాగస్వామేనా? అంటూ వ్యాఖ్యలు
Vijayasai Reddy counters Kanna letter to CM Jagan

టీడీపీ మిడతల దండు బీజేపీ కమలంపై వాలేందుకు బయల్దేరిందంటూ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్వీట్ చేయగా, ఏపీ బీజేపీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ తమ పార్టీ అంతర్గత వ్యవహారాల్లో ఇతరుల జోక్యం అవసరంలేదంటూ సీఎం జగన్ కు లేఖ రాశారు. దీనిపై విజయసాయిరెడ్డి ప్రతిస్పందించారు.

ఏంటి కన్నా... తమరు మాత్రం అన్ని పార్టీల వ్యవహారాల్లో వేలు పెడతారు... లేస్తే మనిషిని కాదన్నట్టు లేఖాస్త్రాలు సంధిస్తారు... టీడీపీ మిడతల దండు బీజేపీపై వాలిందని మేం అలర్ట్ చేస్తే తప్పా? అంటూ నిలదీశారు. బాబు అజెండాతో  ఆంధ్రాలో కమలం పువ్వును కబళించే పనిలో ఉన్న ఆ పసుపు మిడతల దండులో మీరూ భాగస్వామేనా..? అంటూ సందేహం వ్యక్తం చేశారు.