ఏపీలో కరోనా మరణమృదంగం... 24 గంటల్లో 12 మంది మృతి

08-07-2020 Wed 13:42
  • 264కి పెరిగిన కరోనా మరణాల సంఖ్య
  • కొత్తగా 1062 పాజిటివ్ కేసులు
  • 22,259కి పెరిగిన మొత్తం కేసుల సంఖ్య
Twelve people dies of corona in AP

ఏపీలో కరోనా తీవ్రత కొనసాగుతోంది. గడచిన 24 గంటల్లో 12 మంది కరోనాతో మృత్యువాత పడ్డారు. దాంతో రాష్ట్రంలో మరణాల సంఖ్య 264కి పెరిగింది. కొత్తగా 1062 మందికి కరోనా పాజిటివ్ అని తేలడంతో ఇప్పటివరకు రాష్ట్రంలో నమోదైన కేసుల సంఖ్య 22,259కి చేరింది.  11,101 మంది డిశ్చార్జి కాగా, 10,894 మంది చికిత్స పొందుతున్నారు. కాగా, అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 255 కొత్త కేసులు నమోదయ్యాయి. గుంటూరు జిల్లాలో 173, తూర్పు గోదావరి జిల్లాలో 125 కేసులు నమోదయ్యాయి.