మహిళపై కత్తితో దారుణ దాడి.. చోద్యం చూస్తూ వీడియోలు తీసిన స్థానికులు

08-07-2020 Wed 13:29
  • వనపర్తి జిల్లా  గోపాల్‌పేట మండలం బుద్దారంలో ఘటన
  • భూతగాదాలతో దాడి
  • మహిళ పరిస్థితి విషమం 
murder attempt in vanaparty

తెలంగాణలోని వనపర్తి జిల్లా  గోపాల్‌పేట మండలం బుద్దారంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. అందరూ చూస్తుండగా ఓ మహిళను కత్తితో పొడిచారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

పూర్తి వివరాల్లోకి వెళ్తే... రెండు కుటుంబాల మధ్య కొన్నేళ్లుగా భూవివాదం ఉంది. ఈ నేపథ్యంలో ఈ రోజు మరోసారి వారి కుటుంబాలు గొడవపడ్డాయి. అనంతరావుతో పాటు ఆమె భార్య రత్నమ్మపై అర్జున్‌రావు, శేషమ్మ అనే వ్యక్తులు కత్తులతో దాడి చేశారు. దీంతో రత్నమ్మ పరిస్థితి విషమంగా ఉంది. చికిత్స కోసం వారిద్దరినీ హైదరాబాద్‌కు‌ తరలించారు.  
 
ఈ ఘటనలో నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా, ఆ ఘటన స్థానికులముందే జరిగింది అయినప్పటికీ ఎవరూ అడ్డుకోలేదు. అంతేగాక, ఈ ఘటన జరుగుతుండగా వీడియోలు తీసి కొందరు సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారు.