తెలంగాణ హైకోర్టులో కరోనా కలకలం... 10 మందికి పాజిటివ్

08-07-2020 Wed 13:28
  • హైకోర్టులో 50 మందికి పరీక్షలు
  • ఫైళ్లు మొత్తం జ్యుడిషియల్ అకాడమీకి తరలింపు
  • వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ముఖ్యమైన కేసుల విచారణ
Corona positive cases at Telangana high court

తెలంగాణలో కరోనా రక్కసి శరవేగంగా వ్యాపిస్తోంది. తాజాగా హైకోర్టులో కలకలం రేపింది. హైకోర్టు సిబ్బందికి, సెక్యూరిటీ బలగాలకు కరోనా పరీక్షలు నిర్వహించగా 10 మందికి పాజిటివ్ అని తేలింది. మొత్తం 50 మందికి పరీక్షలు నిర్వహించారు. కరోనా ఇన్ఫెక్షన్ ను దృష్టిలో ఉంచుకుని హైకోర్టులోని ఫైళ్లు మొత్తం జ్యుడిషియల్ అకాడమీకి తరలించారు. ముఖ్యమైన కేసులు ఏవైనా ఉంటే వీడియో కాన్ఫరెన్స్ ద్వారానే విచారించాలని నిర్ణయించారు.