Corona Virus: కరోనాతో యుద్ధం చేస్తామంటూ పాట రాసి.. చివరికి ఆ కరోనాతోనే మృతి చెందిన కవి నిస్సార్!

  • కరోనా గురించి జాగ్రత్తలు తీసుకోవాలని పాట రాసిన కవి
  • ఈ పాటను పాడిన వందేమాతరం శ్రీనివాస్ 
  • టీఎస్ఆర్టీసీలో కంట్రోలర్‌గా ఉద్యోగం 
nissar passes away

కరోనా గురించి జాగ్రత్తలు తీసుకోవాలని ఆ మహమ్మారి మన దరికి చేరకుండా తరిమికొట్టాలని పాట రాసి ప్రజల్లో అవగాహన కల్పించిన ప్రముఖ కవి, గాయకుడు నిస్సార్‌ చివరకు ఆ వైరస్‌ బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. ఆయన రాసిన 'కరోనా నీతో యుద్ధం చేస్తాం మా భారత భూభాగాన' పాట ఇటీవల ప్రజల్లోకి బాగా వెళ్లింది. నిస్సార్‌ రాసిన ఈ పాటను సంగీత దర్శకుడు వందేమాతరం శ్రీనివాస్ పాడారు.

మార్చి నెల చివరలో ఈ పాట విడుదలయింది. 130 కోట్ల జనం కలిసి కరోనాను మట్టి కరిపిస్తారని ఆయన పాడిన ఆ పాటకు అందరూ ప్రశంసలు కురిపించారు. అయితే, ఆయనే ఆ కరోనా బారినపడి మృతి చెందడం పట్ల అభిమానులు,  సాహితీవేత్తలు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. యాదాద్రి జిల్లా గుండాల మండలం సుద్దాల గ్రామానికి చెందిన కవి నిస్సార్‌.. టీఎస్ఆర్టీసీలో కంట్రోలర్‌గానూ విధులు నిర్వహిస్తున్నారు. తన కుటుంబంతో కలిసి ఆయన జగద్గిరిగుట్టలో నివాసముంటున్నారు.

More Telugu News