గానకోకిల లతా మంగేష్కర్ ను అచ్చెరువొందించిన యువ గాయని

08-07-2020 Wed 12:46
  • సోషల్ మీడియాలో ఊపేస్తున్న సామదిప్తా ముఖర్జీ ఆలాపన
  • మొజార్ట్ బాణీలకు భారతీయ రాగాలను జోడించిన సామదిప్తా
  • ఆమె తప్పకుండా మంచి సింగర్ అవుతుందన్న లతా మంగేష్కర్
Latha Mangeshkar shares Samadipta Mukharjee singing video

పాశ్చాత్య సంగీతంలో మొజార్ట్ ఒక శిఖరం. ఆయన స్వరపరిచిన సింఫనీలు ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా సంగీతకారులకు నిత్యం స్ఫూర్తినిస్తుంటాయంటే అతిశయోక్తి కాదు. అయితే, మొజార్ట్ వెస్ట్రన్ బాణీలకు భారతీయ శాస్త్రీయ సంగీత స్వరాలను జతచేసి ఓ అమ్మాయి సోషల్ మీడియాను ఊపేస్తోంది. ఆమె పేరు సామదిప్తా ముఖర్జీ. ఆమె గానం ప్రముఖ నేపథ్య గాయని, గానకోకిల లతా మంగేష్కర్ ను సైతం ముగ్ధురాలిని చేసింది. సామదిప్తా ముఖర్జీ ఆలాపనకు తాను మైమరచిపోయానని లతా మంగేష్కర్ ట్వీట్ చేశారు. ఆ అమ్మాయి తప్పకుండా మంచి గాయని అవుతుందని దీవించారు. అంతేకాదు, సామదిప్తా ముఖర్జీ వీడియోను కూడా పంచుకున్నారు.