ప్లాస్మా దానం చేసిన తెలుగు జర్నలిస్టును అభినందించిన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్

08-07-2020 Wed 11:48
  • ఇటీవల కరోనా బారినపడిన ఢిల్లీ రిపోర్టర్ మహాత్మా
  • మహాత్మా ఓ తెలుగు వార్తా చానల్ లో రిపోర్టర్
  • అమూల్యమైన ప్లాస్మా దానం ఓ ప్రాణాన్ని కాపాడుతుందన్న కేజ్రీవాల్
Delhi CM Kejriwal appreciates a reporter who donated his plasma

ఓ తెలుగు చానల్ లో ఢిల్లీ రిపోర్టర్ గా విధులు నిర్వర్తిస్తున్న మహాత్మా కొడియార్ అనే జర్నలిస్టు ఇటీవలే కరోనా బారినపడి కోలుకున్నారు. ధైర్యంగా కరోనాను ఎదుర్కొని సంపూర్ణ ఆరోగ్యం సంతరించుకున్నారు. మహాత్మా తాజాగా ఢిల్లీలోని ప్లాస్మా బ్యాంక్ లో తన ప్లాస్మాను దానం చేశారు. అనేకమంది కరోనా పేషెంట్ల చికిత్సకు అవసరమైన ప్లాస్మాను అందించారు.

దీనిపై ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. 'ప్రియమైన మహాత్మా కొడియార్, మీ అమూల్యమైన ప్లాస్మా దానం ఓ ప్రాణం కాపాడేందుకు సాయపడుతుంది' అంటూ ట్వీట్ చేశారు. 'మన మీడియా రిపోర్టర్లు ఎంతో ప్రమాదకర పరిస్థితుల్లోనూ ముందు నిలిచి పోరాడుతూ మనకు వార్తలు అందిస్తున్నారు' అంటూ కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు.