Sushmitha: నిర్మాతగా మారుతున్న చిరంజీవి తనయ!

Chiranjeevis daughter Susmitha turns as producer
  • కాస్ట్యూమ్ డిజైనర్ గా పేరుతెచ్చుకున్న సుస్మిత 
  • ఓటీటీ కోసం వెబ్ సీరీస్ నిర్మాణానికి శ్రీకారం
  • 'గోల్డ్ బాక్స్ ఎంటర్ టైన్మెంట్' బ్యానర్ ఏర్పాటు
  • భవిష్యత్తులో ఫ్యామిలీ హీరోలతో సినిమాల నిర్మాణం
ఇప్పటికే కాస్ట్యూమ్ డిజైనర్ గా చిరంజీవి పెద్దమ్మాయి సుస్మిత అందరికీ సుపరిచితమే. చిరంజీవి నటించిన కొన్ని చిత్రాలకు ఆమె కాస్ట్యూమ్ డిజైనర్ గా పనిచేసి, తన అభిరుచిని ప్రదర్శించి మంచి పేరుతెచ్చుకున్నారు. ప్రస్తుతం చిరంజీవి నటిస్తున్న చిత్రాలకు కూడా తనే కాస్ట్యూమ్స్ డిజైన్ చేస్తున్నారు. ఇక ఇప్పుడామె తన కెరీర్ ని మరో మలుపు తిప్పుకుంటున్నారు. నిర్మాణ రంగంలోకి అడుగుపెడుతూ నిర్మాతగా కూడా మారుతున్నారు.

'గోల్డ్ బాక్స్ ఎంటర్ టైన్మెంట్' పేరిట ఓ చిత్ర నిర్మాణ సంస్థను నెలకొల్పి ముందుగా వెబ్ సీరీస్ నిర్మాణానికి ఆమె శ్రీకారం చుట్టారు. నిన్ననే దీనికి సంబంధించిన పనులు ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం ఓటీటీ వేదికలు బాగా ప్రాచుర్యంలోకి రావడంతో వాటి కోసం ఆమె పలు వెబ్ సీరీస్ లను నిర్మించడానికి ప్లాన్ చేసుకుంటున్నారు. ఇక ముందు ముందు తమ ఫ్యామిలీ హీరోలతో ఆమె సినిమాలు కూడా నిర్మించే ఆలోచన చేస్తున్నట్టు సమాచారం.
Sushmitha
Chiranjeevi
Web series
OTT

More Telugu News