సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం 

08-07-2020 Wed 07:30
  • మనం అడిగినంతా ఇవ్వరంటున్న తమన్నా
  • హిందీలోకి బన్నీ సినిమా రీమేక్ ప్రయత్నాలు
  • ఓటీటీలో విడుదలైన చిత్రానికి సీక్వెల్  
Thamanna on her remuneration

*  'మనకున్న మార్కెట్టును బట్టే మనకి పారితోషికం లభిస్తుంది' అంటోంది కథానాయిక తమన్నా. ఇటీవల తాను అడిగినంత ఇవ్వకపోవడంతో ఓ చిత్రంలో నటించడానికి తమన్నా నిరాకరించిందంటూ వార్తలొచ్చాయి. దీనిపై ఆమె స్పందిస్తూ, 'మనం అడిగినంతా ఎవ్వరూ ఇవ్వరు. మనకు ఎంత మార్కెట్ వుందో అంతే ఇస్తారు. అలాంటప్పుడు నేనెందుకు ఎక్కువ అడుగుతాను? ఇవన్నీ అర్థం పర్థం లేని పుకార్లు' అంటూ కొట్టిపారేసింది.
*  అల్లు అర్జున్, పూజ హెగ్డే జంటగా హరీశ్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన డీజే (దువ్వాడ జగన్నాథం) చిత్రాన్ని హిందీలో రీమేక్ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ చిత్రాన్ని ఓ బాలీవుడ్ హీరోతో రీమేక్ చేయడానికి ప్రముఖ నిర్మాత దిల్ రాజు ప్లాన్ చేస్తున్నారట.    
*  రవికాంత్ పేరెపు దర్శకత్వంలో రూపొందిన 'కృష్ణ అండ్ హిజ్ లీల' చిత్రం ఇటీవల డైరెక్టుగా నెట్ ఫ్లిక్స్ లో విడుదలై, ప్రస్తుతం స్ట్రీమింగ్ లో వుంది. ఈ చిత్రానికి మంచి రెస్పాన్స్ రావడంతో దీనికి సీక్వెల్ చేసే ప్రయత్నాలలో దర్శకుడు రవికాంత్ వున్నాడట.