ఏపీలో 13 ప్రత్యేక కరోనా జైళ్ల ఏర్పాటు.. కొత్త ఖైదీలు తొలుత ఇక్కడికే!

08-07-2020 Wed 06:22
  • జైళ్లలో కోవిడ్ వ్యాప్తి చెందకుండా చర్యలు
  • తొలుత ఇక్కడ కోవిడ్ పరీక్షలు
  • ఆదేశాలు జారీ చేసిన ప్రభుత్వం
AP Govt converted 13 jails into covid jails

కరోనాకు అడ్డుకట్ట వేసే విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. జిల్లాకొక కొవిడ్ జైలును ఏర్పాటు చేసింది. శ్రీకాకుళం, విజయనగరం, అనకాపల్లి, కాకినాడ, భీమవరం, మచిలీపట్నం, నరసరావుపేట, ప్రొద్దుటూరు, డోన్‌, గుత్తి, పీలేరు, కావలి, మార్కాపురంలోని 13 జైళ్లను కరోనా జైళ్లుగా మార్చింది. కొత్త ఖైదీల ద్వారా జైలులో అప్పటికే ఉంటున్న ఇతర ఖైదీలకు వైరస్ సోకకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకుంది.

ఇక నుంచి వచ్చే పురుష ఖైదీలను ఈ జైళ్లకు తరలించి కోవిడ్ పరీక్షలు నిర్వహిస్తారు. కరోనా సోకలేదని తేలితే కోర్టు సూచించిన జైలుకు పంపిస్తారు. పాజిటివ్ వస్తే ఆసుపత్రికి తరలిస్తారు. ఆయా కోవిడ్ జైళ్లలో విధులు నిర్వర్తించే సిబ్బందికి వైరస్ సోకకుండా రక్షణ చర్యలు చేపట్టాల్సిందిగా జైళ్ల శాఖ డీజీని ప్రభుత్వం ఆదేశించింది.