తెలంగాణలో కరోనా బీభత్సం... వెల్లువెత్తుతున్న పాజిటివ్ కేసులు

07-07-2020 Tue 22:11
  • 24 గంటల్లో 1,879 మందికి కరోనా నిర్ధారణ
  • ఏడుగురి మృతి
  • 313కి పెరిగిన మరణాలు
  • మరో 1,506 మంది డిశ్చార్జి
Corona cases flooded in Telangana

తెలంగాణలో కరోనా మహమ్మారి విపరీతంగా వ్యాపిస్తోంది. కొత్తగా 1,879 మందికి కరోనా నిర్ధారణ అయింది. వారిలో 1,422 మంది హైదరాబాద్, పరిసర ప్రాంతాలకు చెందినవాళ్లే. ఓవరాల్ గా తెలంగాణలో ఇప్పటివరకు 27,612 కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో ఏడుగురు మృత్యువాత పడగా, రాష్ట్రంలో కరోనా మృతుల సంఖ్య 313కి పెరిగింది. ఇవాళ 1506 మంది డిశ్చార్జి కాగా, ఇంకా 11,012 మంది చికిత్స పొందుతున్నారు.