Jair Bolsonaro: బ్రెజిల్ లో కరోనా మహోగ్రరూపం... అధ్యక్షుడు బోల్సొనారోకు పాజిటివ్

Brazil President Jair Bolsonaro tested corona positive
  • మూడో పరీక్షలో బోల్సొనారోకు కరోనా నిర్ధారణ
  • మాస్కులు ఎందుకంటూ న్యాయస్థానాన్ని ఆక్షేపించిన అధ్యక్షుడు
  • బ్రెజిల్ లో సామాజిక సంక్రమణం
బ్రెజిల్ లో కరోనా మహమ్మారి వీర విజృంభణ చేస్తోంది. చివరికి ఆ దేశ అధ్యక్షుడు జైర్ బోల్సొనారో కూడా కరోనా బారి నుంచి తప్పించుకోలేకపోయారు. ఆయనకు గత రెండు పరీక్షల్లో నెగెటివ్ వచ్చినా, మూడో పరీక్షలో పాజిటివ్ అని తేలింది. బ్రెజిల్ లో ఇప్పటికే కరోనా వ్యాప్తి సామాజిక సంక్రమణం దశలో ప్రమాదకర స్థాయికి చేరింది. అమెరికా తర్వాత ప్రపంచంలో బ్రెజిల్ లోనే అత్యధిక కేసులున్నాయి. ఇప్పటివరకు ఇక్కడ 16 లక్షల మందికి పైగా కరోనా బారినపడ్డారు.

నిత్యం వేల సంఖ్యలో కొత్త కేసులు వస్తున్న తరుణంలో అధ్యక్షుడు బోల్సొనారో వ్యవహార శైలి తీవ్ర విమర్శలపాలైంది. దేశాధ్యక్షుడైనా సరే కరోనా నివారణ కోసం మాస్కు ధరించాలని న్యాయస్థానం పేర్కొన్నా, 'అవన్నీ అర్థం లేనివి' అంటూ బోల్సొనారో తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తరచుగా కరోనా టెస్టులు చేయించుకోవడం వల్ల తన ఊపిరితిత్తులు శుభ్రపడుతున్నాయంటూ వ్యంగ్యం ప్రదర్శించారు. చివరికి తానే కరోనా బారిన పడ్డారు.
Jair Bolsonaro
Corona Virus
Positive
Brazil

More Telugu News