LG Polymers: ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ ఘటనలో భారీగా అరెస్టులు... పోలీసుల అదుపులో సంస్థ సీఈవో, డైరెక్టర్లు

  • సంచలనం సృష్టించిన ఎల్జీ పాలిమర్స్ ఘటన
  • 15 మంది మృతి
  • యాజమాన్య నిర్లక్ష్యమే కారణమంటూ కేసు నమోదు
Police arrests LG Polymers CEO and director

విశాఖపట్నంలో ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమ నుంచి ప్రమాదకర స్టైరీన్ విషవాయువు లీకై 15 మంది మృతి చెందడం తీవ్ర సంచలనం సృష్టించింది. తాజాగా, ఈ ఘటనలో పోలీసులు 12 మందిని అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయిన వారిలో ఎల్జీ పాలిమర్స్ సీఈఓ సున్ కి జియాంగ్, సంస్థ డైరెక్టర్ డీఎస్ కిమ్, అదనపు డైరెక్టర్ మోహన్ రావు ఉన్నారు.

 ప్రమాదానికి ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమ యాజమాన్యం నిర్లక్ష్యమే కారణమని ఆరోపిస్తూ నిందితులపై 304(2), 338, 285, 337, 284, 278 ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కాగా, ఈ గ్యాస్ లీక్ ఘటనపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన హైపవర్ కమిటీ తన పూర్తి నివేదికను నిన్ననే సీఎం జగన్ కు సమర్పించింది. అటు నీరబ్ కుమార్ కమిటీ కూడా యాజమాన్య నిర్లక్ష్యమే ప్రమాదానికి దారితీసిందని వెల్లడించింది.

More Telugu News