గవర్నర్ ను కలిసిన తెలంగాణ సీఎస్, హెల్త్ సెక్రటరీ 

07-07-2020 Tue 20:48
  • నిన్న జరగాల్సిన భేటీకి హాజరుకాని సీఎస్, హెల్త్ సెక్రటరీ
  • కాసేపటి క్రితం గవర్నర్ తో భేటీ
  • కరోనాకు సంబంధించి పలు అంశాలపై చర్చ
TS CS and Health Secretary meets Governor Tamilisai

తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి శాంతకుమారి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో కరోనా పరిస్థితి, ప్రభుత్వం చేపట్టిన చర్యలు, ప్రైవేటు ఆసుపత్రుల దోపిడీ, జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధిక కేసుల నమోదు తదితర అంశాలపై చర్చించారు. గవర్నర్ అడిగిన పలు ప్రశ్నలకు వారు వివరణ ఇచ్చారు.

వాస్తవానికి ఈ సమీక్షా సమావేశం నిన్ననే జరగాల్సి ఉంది. రాజ్ భవన్ కు రావాల్సిందిగా వీరికి గవర్నర్ కార్యాలయం నుంచి సమాచారం వెళ్లింది. అయితే సీఎంతో భేటీ కావాల్సిన నేపథ్యంలో, వారు గవర్నర్ తో సమావేశాన్ని వాయిదా వేసుకున్నారు. అయితే, గవర్నర్ తో సమావేశానికి వీరిద్దరూ రాకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో ఈ సాయంత్రం గవర్నర్ తో ఇద్దరూ భేటీ అయ్యారు.
.