Devineni Uma: 'సెంటు పట్టా' పేరిట మీ పార్టీ నాయకులు చేస్తున్న అవినీతిపై జవాబు చెప్పండి: సీఎంపై దేవినేని ఉమ ధ్వజం

  • ఇళ్ల స్థలాల విషయంలో టీడీపీ విమర్శల దాడి
  • రూ.7,500 కోట్లతో ఎక్కడ కొన్నారో వెల్లడించాలన్న ఉమ
  • ఇంటి బకాయిలు ఎందుకు చెల్లించలేదంటూ ట్వీట్
Devineni Uma asks CM Jagan over housing lands

పేదలకు ఇళ్ల పేరిట వైసీపీ నేతలు దోచుకుంటున్నారంటూ ఏపీ ప్రభుత్వంపై టీడీపీ విమర్శల దాడి చేస్తోంది. తాజాగా దీనిపై దేవినేని ఉమ వ్యాఖ్యానించారు. 'సెంటు పట్టా' పేరిట వైసీపీ నేతలు చేస్తున్న అవినీతి, దోపిడీపై ప్రజల నిరసనలకు సీఎం జగన్ జవాబు చెప్పాలని నిలదీశారు. భూములకు రూ.7,500 కోట్లు ఎలా ఖర్చు చేశారో చెప్పాలని, ఎక్కడెక్కడ ఎంతెంత రేట్లు పెట్టి కొన్నారో బయటపెట్టాలని డిమాండ్ చేశారు.

ఉపాధి హామీలో రూ.4 వేల కోట్ల విలువైన పనులు ఎక్కడ చేశారు? ఇంటి బకాయిలు రూ.4,300 కోట్లు ఎందుకు చెల్లించడంలేదు? అంటూ ప్రశ్నలు సంధించారు. ఈ మేరకు ఉమ ట్వీట్ చేశారు. గత ప్రభుత్వం కట్టిన ఇళ్లను వదిలేస్తూ, సెంటు భూమి ఇస్తామంటూ జగన్ సర్కారు చెబుతోందని, సెంటు భూమి పట్టాకు రేట్లు కడుతూ వైసీపీ నేతలు దోపిడీకి తెరలేపారని టీడీపీ విమర్శలు చేస్తుండడం తెలిసిందే.

More Telugu News