Raja Singh: తెలంగాణ కొత్త సచివాలయం మసీదులా ఉంది: రాజాసింగ్ విమర్శలు

  • కొత్త సచివాలయం నిర్మిస్తున్న తెలంగాణ సర్కారు
  • ప్రజల కంటే సచివాలయం ముఖ్యమైందా అంటూ రాజాసింగ్ ఆగ్రహం
  • సచివాలయం ప్లాన్ ఎంఐఎం నేతలు ఇచ్చారా? అంటూ వ్యంగ్యం
Raja Singh slams CM KCR over new secretariat issue

తెలంగాణలో కొత్త సచివాలయం నిర్మించే క్రమంలో పాత సచివాలయ భవనాలను కూల్చివేస్తుండడంపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ తీవ్రంగా స్పందించారు. కరోనాతో ప్రజలు చనిపోతుంటే పట్టించుకోని ప్రభుత్వానికి కొత్త సచివాలయం ముఖ్యమైందా? అంటూ ప్రశ్నించారు. ప్రజల ప్రాణాలకు విలువ లేదా? అని నిలదీశారు. కొత్త సచివాలయం కోసం పాత నిర్మాణాలు కూల్చివేయడం సరికాదని, పాత సచివాలయ భవనాలు 50 ఏళ్ల వరకు పనిచేస్తాయని నిపుణులు కూడా చెప్పారని తెలిపారు.

నిజాం తన పేరు చిరస్థాయిగా ఉండాలని చార్మినార్ నిర్మిస్తే.. ఇప్పుడు కేసీఆర్ కూడా పేరు కోసం కొత్త సచివాలయం నిర్మిస్తున్నారని ఆరోపించారు. సీఎం కేసీఆర్ ఎనిమిదో నిజాంలా తయారయ్యారని, తెలంగాణ కొత్త సచివాలయం ఓ మసీదులా ఉందని, హజ్ హౌస్ లా కనిపిస్తోందని రాజాసింగ్ వ్యాఖ్యానించారు. కొత్త సచివాలయ నిర్మాణానికి ప్లాన్ ఎంఐఎం నేతలు ఇచ్చారా? అంటూ ఎద్దేవా చేశారు.

More Telugu News