ఆరోగ్యంగా గుండ్రాయిలా ఉన్నావు... ఈ డ్రామాలేంటి అచ్చెన్నా..?: విజయసాయిరెడ్డి

07-07-2020 Tue 13:12
  • ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చాలంటూ అచ్చెన్న పిటిషన్
  • కార్పొరేట్ ఆసుపత్రే కావాలా అంటూ విజయసాయి వ్యంగ్యం
  • ఇది జగన్ ప్రభుత్వం అంటూ ట్వీట్
Vijayasai Reddy comments on Atchannanidu health condition

ఈఎస్ఐ కొనుగోళ్ల అవకతవకల వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న టీడీపీ సీనియర్ నేత అచ్చెన్నాయుడు ప్రస్తుతం విజయవాడ సబ్ జైలులో ఉన్నారు. తనకు అనారోగ్యంగా ఉందని, ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలంటూ ఆయన హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై తీర్పు రావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి వ్యంగ్యంగా స్పందించారు. ఆరోగ్యంగా గుండ్రాయిలా ఉన్నా ఈ డ్రామాలేంటి అచ్చెన్నా? అంటూ ట్విట్టర్ లో ప్రశ్నించారు. "కార్పొరేట్ ఆసుపత్రే కావాలా? ఏం, ఈఎస్ఐ ఆసుపత్రి వద్దా? మీ చంద్రబాబు హయాంలా కాదు, ఇది జగన్ ప్రభుత్వం. ఆసుపత్రుల్లో అన్ని సౌకర్యాలు కల్పించింది. ఏ సమస్య వచ్చినా చూసుకుంటుంది" అంటూ వ్యాఖ్యానించారు.