Dulquer Salmaan: పెళ్లి చేసుకుంటే లైఫ్ బాగుంటుందని దుల్ఖర్ చెప్పేవాడు: నిత్యా మీనన్

Dulquer alway motivated me to marry says Nitya Menon
  • దుల్ఖర్ పూర్తిగా ఫ్యామిలీ పర్సన్
  • కుటుంబానికి ఎంతో విలువ ఇస్తాడు
  • మా ఇద్దరి మధ్య కెమిస్ట్రీ అద్భుతంగా కుదిరింది
మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి కుమారుడు దుల్ఖర్ సల్మాన్, మలయాళ భామ నిత్యామీనన్ ఇద్దరూ... ఒక భాషకే పరిమితం కాకుండా అవకాశం వచ్చిన అన్ని భాషా చిత్రాల్లో నటిస్తున్నారు. దక్షిణాదిన తమకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను సొంతం చేసుకున్న వీరిద్దరూ... బాలీవుడ్ లో సైతం నటించి, మెప్పించారు. ప్రముఖ దర్శకుడు మణిరత్నం తెరకెక్కించిన  'ఓకే బంగారం' సినిమాలో వీరిద్దరూ జంటగా నటించారు. తమిళం, తెలుగు, మలయాళ భాషల్లో ఈ  సినిమా హిట్టైంది. వీరిద్దరి మధ్య మంచి స్నేహం ఉంది.

తాజాగా ఓ తమిళ పత్రికకు నిత్య ఇంటర్వ్యూ ఇచ్చింది. ఈ సందర్భంగా దుల్ఖర్ స్నేహ స్వభావాన్ని ఎంతగానో కొనియాడింది. దుల్ఖర్ పూర్తిగా ఫ్యామిలీ పర్సన్ అని... తన తల్లిదండ్రులు, భార్య, పిల్లలకు ఎంతో విలువ ఇస్తాడని చెప్పింది. పెళ్లి చేసుకుంటే లైఫ్ చాలా బాగుంటుందని... తనను కూడా పెళ్లి చేసుకోమని ఎన్నోసార్లు మోటివేట్ చేశాడని తెలిపింది. సినిమాల విషయానికి వస్తే తమ మధ్య కెమిస్ట్రీ అద్భుతంగా కుదిరిందని... 'ఓకే బంగారం' సినిమాలో తెరపై తమను తాము చూసుకుని ఆశ్చర్యపోయామని చెప్పింది.
Dulquer Salmaan
Nitya Menon
Tollywood
Bollywood

More Telugu News