బాలీవుడ్ స్టార్ తో కలసి ప్రభాస్ మల్టీ స్టారర్?

07-07-2020 Tue 12:40
  • ప్రస్తుతం రెండు చిత్రాలు చేస్తున్న ప్రభాస్ 
  • బాలీవుడ్ దర్శకుడు ఓమ్ రావత్ తో మరో చిత్రం  
  • హృతిక్, ప్రభాస్ హీరోలుగా భారీ మల్టీ స్టారర్
Prabhas multi starrer with Hritik Roshan

టాలీవుడ్ బిజీ స్టార్ ప్రభాస్ బాలీవుడ్ దర్శకుడితో సినిమా చేయనున్నాడంటూ వచ్చిన న్యూస్ పెద్ద సంచలనమైంది. ఇంతలోనే ఈ సినిమాకు సంబంధించిన మరో విశేషం వెల్లడైంది. ఇది మల్టీ స్టారర్ చిత్రమనీ, ఇందులో బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ కూడా నటిస్తున్నాడనీ అంటున్నారు.

హృతిక్, ప్రభాస్.. ఇద్దరికీ కూడా యాక్షన్ హీరోలుగా పేరుంది. దాంతో ఈ చిత్రాన్ని భారీ యాక్షన్ ఫిలింగా నిర్మించడానికి ప్లాన్ చేస్తున్నారట. ఇక దీనికి 'తానాజీ' ఫేం ఓమ్ రావత్ దర్శకత్వం వహిస్తాడనీ, ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ టీ సీరీస్ దీనిని నిర్మిస్తుందనీ సమాచారం.

ఇదిలావుంచితే, ప్రభాస్ ప్రస్తుతం రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో 'రాధే శ్యామ్' అనే చిత్రాన్ని చేస్తున్నాడు. దీని తర్వాత నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వైజయంతీ మూవీస్ నిర్మించే మరో భారీ చిత్రంలో నటిస్తాడు. ఆ తర్వాతే బాలీవుడ్ దర్శకుడి మల్టీ స్టారర్ మొదలవుతుంది. అంటే, దీనికి ఇంకా సమయం ఉందన్నమాట!