తెలంగాణ నూతన సచివాలయం ఇదే.. ఫొటో విడుదల చేసిన ప్రభుత్వం

07-07-2020 Tue 10:12
  • భవనం ముందు నీటి కొలను
  • ఆకట్టుకునేలా ఉన్న నమూనా ఫొటో
  • విడుదల చేసిన ముఖ్యమంత్రి కార్యాలయం
Telangana CMO released new photo of new secretariat

తెలంగాణ సచివాలయ భవన కూల్చివేత పనులు ప్రారంభించిన ప్రభుత్వం నూతన భవన నమూనాను ఖరారు చేసింది. ఇందుకు సంబంధించిన నమూనా ఫొటోను ముఖ్యమంత్రి కార్యాలయం తాజాగా విడుదల చేసింది. చూడడానికి రాజప్రాసాదంలా ఉన్న ఈ నమూనా ఆకట్టుకునేలా ఉంది. భవనం ముందున్న నీటి కొలనులో భవనం ప్రతిబింబిస్తోంది. నూతన సచివాలయాన్ని నిర్మించాలని ప్రభుత్వం ఎప్పటి నుంచో అనుకుంటున్నా కోర్టు కేసుల కారణంగా ఇన్నాళ్లూ వాయిదా పడుతూ వస్తోంది. తాజాగా, పాత భవనం కూల్చివేతకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఈ ఉదయం భవనం కూల్చివేత పనులను ప్రభుత్వం ప్రారంభించింది.