ఈ వీడియో నాకు ఎంతో ప్రోత్సాహాన్నిస్తోంది: ఆనంద్ మహీంద్రా

Mon, Jul 06, 2020, 08:43 PM
Anand Mahindra responds on a social video
  • పల్లెటూళ్లో చిన్న పిల్లల సందోహం
  • మట్టిలో జారుతూ చెరువు నీళ్లలో పడుతున్న వీడియోపై ఆనంద్ స్పందన
  • ఇందులో ఎంతో సందేశం ఉందన్న మహీంద్రా
ఆనంద్ మహీంద్రా... నిత్యం వేల కోట్ల వ్యాపార లావాదేవీలతో బిజీగా ఉండే ఈ బిజినెస్ టైకూన్... తనకున్న కొద్దిపాటి విరామాల్లో సోషల్ మీడియా ప్రపంచంలో ఏంజరుగుతుందో ఓ కన్నేసి ఉంచుతారు. ఆయన రీట్వీట్ చేశారంటే అందులో ఏదో విషయం ఉందన్నమాటే!

తాజాగా, కొందరు చిన్నపిల్లలు మట్టిలో జారుతూ వచ్చి చెరువునీటిలో పడడం పట్ల ఆయన స్పందించారు. "ఈ వీడియో నాకు సోమవారం మళ్లీ పని ప్రారంభించడానికి అవసరమైన ఉత్సాహాన్ని ఇస్తోంది. ఈ వీడియోలో ఎంతో సందేశం ఉంది. కరోనా తర్వాత ప్రపంచం యావత్తు నిరాడంబర జీవితం గడిపేందుకు ప్రాధాన్యం ఇస్తుంది" అంటూ వ్యాఖ్యానించారు. ఈ వీడియోను నాంది ఫౌండేషన్ సీఈవో మనోజ్ కుమార్ ట్వీట్ చేయగా, ఆనంద్ మహీంద్రా రీట్వీట్ చేశారు.

X

Feedback Form

I agree to Terms of Service & Privacy Policy
Do you hate Fake News, Misleading Titles, Cooked up Stories and Cheap Analyses?...
We are here for YOU: Team ap7am.com
GarudaVega Banner Ad