COVAXIN: భారతదేశ తొలి కరోనా టీకా కోవాగ్జిన్‌కు బెలగావిలో తొలి ట్రయల్స్

  • ఐసీఎంఆర్, ఎన్ఐవీ సహకారంతో రూపుదిద్దుకున్న టీకా
  • పూర్తి ఆరోగ్యంగా ఉన్న 200 మందిపై క్లినికల్ ట్రయల్స్
  • ఆగస్టు 15 నాటికి అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నం
ICMR Ready for Covaxin clinical trials

భారతదేశంలో తయారైన తొలి కరోనా వ్యాక్సిన్ కోవాగ్జిన్‌కు కర్ణాటకలోని బెలగావిలో తొలి ట్రయల్స్ నిర్వహించనున్నారు. భారత వైద్య పరిశోధన సంస్థ (ఐసీఎంఆర్), నేషనల్ ఇని‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (ఎన్ఐవీ) సహకారంతో భారత్ బయోటిక్ ఈ టీకాను అభివృద్ధి చేసింది. బెలగావిలో దీనిని తొలిసారి పరీక్షించనున్న అధికారులు ఆరోగ్యంగా ఉన్న 200 మంది వలంటీర్ల బృందంపై క్లినికల్ ట్రయల్స్‌కు సిద్ధమయ్యారు. ఐసీఎంఆర్ పర్యవేక్షణలో ఈ పరీక్షలు జరగనున్నాయని అధికారులు తెలిపారు. ట్రయల్స్‌ను విజయవంతంగా పూర్తి చేసి ఆగస్టు 15 నాటికి ఈ టీకాను వినియోగానికి అందుబాటులోకి తీసుకు రావాలని ప్రభుత్వం యోచిస్తోంది.

More Telugu News