ఆంధ్రప్రదేశ్ లో ఈ సంవత్సరం అన్ని రకాల అవార్డులు రద్దు!

06-07-2020 Mon 08:13
  • రోజురోజుకూ పెరుగుతున్న కరోనా ఉద్ధృతి
  • ముందు జాగ్రత్త చర్యగా నిర్ణయం
  • వెల్లడించిన సమాచార, పౌర సంబంధాల శాఖ
Andhrapradesh Cancels All Types of Awards this Year

కరోనా వైరస్ ఉద్ధృతి రోజురోజుకూ పెరుగుతున్న వేళ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో వివిధ రంగాలలో విశిష్ట సేవలందించే వ్యక్తులు, సంస్థలకు ప్రకటించే అన్ని రకాల అవార్డులను 2020-21 సంవత్సరానికి రద్దు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్ ఒక ప్రకటన విడుదల చేశారు. కాగా, కరోనా వ్యాప్తిని నిరోధించేందుకు ముందు జాగ్రత్త చర్యగానే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఉన్నతాధికారులు వెల్లడించారు. ఏపీలో కొత్తగా 998 పాజిటివ్ కేసులు రాగా, మొత్తం కేసుల సంఖ్య 18,697కు పెరిగిన సంగతి తెలిసిందే. ఇప్పటివరకూ 232 మంది మరణించారని అధికార గణాంకాలు చెబుతున్నాయి.