హైదరాబాదులో రేపటినుంచి తెరుచుకోనున్న మార్కెట్లు

05-07-2020 Sun 17:06
  • హైదరాబాదులో కరోనా విజృంభణ
  • 10 రోజులు మూతపడిన మార్కెట్లు
  • కరోనా భయంతో స్వచ్ఛందంగా దుకాణాలు మూసిన యజమానులు
Markets in Hyderabad will be opened tomorrow

తెలంగాణ రాజధాని హైదరాబాదులో కరోనా విజృంభిస్తుండడంతో ప్రధాన మార్కెట్లు మూతపడిన సంగతి తెలిసిందే. బేగం బజార్, ట్రూప్ బజార్, లాడ్ బజార్, సికింద్రాబాద్ జనరల్ బజార్ మార్కెట్లను కరోనా భయంతో స్వచ్ఛందంగా మూసివేశారు.

10 రోజుల విరామం అనంతరం ఆయా మార్కెట్లు రేపటి నుంచి తెరుచుకోనున్నాయి. ఓవైపు కరోనా కేసులు పెరుగుతున్నప్పటికీ, దుకాణాల యజమానులు షాపులు తెరవాలనే నిర్ణయించుకున్నారు. అటు తెలంగాణ ప్రభుత్వం కూడా మరోసారి లాక్ డౌన్ విధించేందుకు సుముఖంగా లేకపోవడంతో దుకాణదారులు వ్యాపారాల కొనసాగింపుకే మొగ్గు చూపుతున్నారు.