ఒడిశాలో భారీ ఎన్ కౌంటర్... నలుగురు మావోయిస్టుల మృతి

05-07-2020 Sun 13:42
  • కాల్పులతో దద్దరిల్లిన సిర్లా అటవీప్రాంతం
  • అడవుల్లోకి పరారైన మావోలు
  • భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్న భద్రతా బలగాలు
Four maoists killed in a encounter in Odisha

ఒడిశాలోని కందమాల్ జిల్లా అటవీప్రాంతం తుపాకుల గర్జనతో మార్మోగింది. ఇక్కడి సిర్లా అటవీప్రాంతంలో భద్రతా బలగాలకు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో నలుగురు మావోయిస్టులు మరణించారు. మరికొందరు మావోలు పరారయ్యారు. పరారైన దళ సభ్యుల కోసం సిర్లా అడవుల్లో గాలింపు చేపట్టారు. కాగా, ఘటనా ప్రాంతంలో భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. మరణించిన మావోలను వంశధార-నాగావళి-గుంసూరు డివిజన్ దళ సభ్యులుగా భావిస్తున్నారు.