పవన్‌ కల్యాణ్‌ బయోపిక్‌ తీస్తున్నానంటూ వస్తోన్న వార్తలపై క్లారిటీ ఇచ్చిన ఆర్జీవీ

05-07-2020 Sun 13:37
  • 'పవర్‌ స్టార్‌' పేరిట సినిమా తీస్తున్న ఆర్జీవీ
  • ఈ సినిమా ఏ వ్యక్తికో చెందిన బయోపిక్ కాదు
  • ఎన్నికల్లో ఓడిన ఓ సినీ స్టార్ గురించి తీస్తున్నాను
  • ఇది పవన్ కల్యాణ్‌ బయోపిక్‌ అని వస్తోన్న ఊహాగానాలు సరికాదు
Media speculations that POWER STAR is PAWAN KALYANs story is incorrect

వివాదాస్పద దర్శకుడు రామ్‌ గోపాల్ వర్మ 'పవర్‌ స్టార్‌' పేరిట సినిమా తీస్తానని ఇటీవల ప్రకటన చేసిన విషయం తెలిసిందే. ఆ సందర్భంగా రామ్ గోపాల్‌ వర్మ ఓ వీడియో పోస్ట్ చేశారు. ఈ వీడియోలోని నటుడు అచ్చం పవన్ కల్యాణ్‌లా ఉండడం, పవర్‌ స్టార్‌లా స్టైల్‌గా నడుచుకుంటూ వెళ్లడం అందరి దృష్టినీ ఆకర్షించింది. అంతేగాక,  ఈ సినిమాలో పీకే, ఎమ్మెస్, ఎన్‌బీ, టీఎస్‌ ఉంటారని ఆయన చెప్పారు. ఆ పదాలకు అర్థం చెబుతూ మెగాస్టార్‌, నాగబాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్‌ అనే ఇప్పటికే అందరూ గుర్తించారు. అయితే, ఇది పవన్ కల్యాణ్ బయోపిక్ కాదని వర్మ వివరణ ఇచ్చారు.

'నేను తీస్తోన్న పవర్‌ స్టార్‌ సినిమా ఏ వ్యక్తికో చెందిన బయోపిక్ కాదు. పార్టీ ప్రారంభించి, ఎన్నికల్లో ఓడిన ఓ టాప్‌ సినీ స్టార్.. అనంతర పరిణామాల గురించి కల్పిత కథతో ఈ సినిమా రూపుద్దికుంటోంది. ఏ వ్యక్తి జీవితాన్నైనా ఈ కథ పోలి ఉంటే అది కేవలం యాదృచ్ఛికం మాత్రమే' అని చెప్పారు. పవర్ స్టార్‌ అనే సినిమా పవన్ కల్యాణ్‌ బయోపిక్‌ అంటూ మీడియాలో వస్తోన్న ఊహాగానాలు బాధ్యతారాహితం, వాటిల్లో నిజాలు లేవని ఆయన ట్వీట్లు చేశారు.