China: ఉద్రిక్తతల నేపథ్యంలో భూటాన్‌తో నెలకొన్న వివాదం గురించి మరో కీలక ప్రకటన చేసిన చైనా

  • సరిహద్దుల్లో భారత్‌తో గాల్వన్‌ లోయ వద్ద ఉద్రిక్తతలు
  • భూటాన్‌తో తూర్పు ప్రాంతంలో చాలా ఏళ్లుగా వివాదాలు
  • తొలిసారి అధికారికంగా తెలిపిన డ్రాగన్ దేశం
  • ఎవరూ కల్పించుకోవద్దని భారత్‌ను ఉద్దేశించి వ్యాఖ్య
  • ఇప్పటివరకు స్పందించని భారత్
china on bhutan land

సరిహద్దుల్లో భారత్‌తో గాల్వన్‌ లోయ వద్ద ఉద్రిక్తతలు నెలకొన్న సమయంలో చైనా మరో వివాదాస్పద ప్రకటన చేసింది. భూటాన్‌తో తూర్పు ప్రాంతంలో చాలా ఏళ్లుగా సరిహద్దు వివాదాలున్నాయంటూ తొలిసారి తెలిపింది. భూటాన్‌తో మధ్య, పశ్చిమ ప్రాంతాల్లో వివాదాల పరిష్కారం సాధ్యమైనప్పటికీ, తూర్పు ప్రాంతంలో మాత్రం వివాదం కొనసాగుతోందని చెప్పింది.

ఆ దేశంతో కొనసాగుతోన్న ఈ సరిహద్దు వివాదంలో ఎవరూ కల్పించుకోవాల్సిన అవసరం లేదని భారత్‌ను ఉద్దేశించి పరోక్ష వ్యాఖ్యలు చేసింది. భూటాన్‌తో తూర్పు ప్రాంతంలో వివాదం ఉందని డ్రాగన్ దేశం ప్రకటించిన ఆ ప్రాంతం భారత్‌లోని అరుణాచల్‌ ప్రదేశ్‌ సరిహద్దుల వద్ద ఉంటుంది.

1984 నుంచి భూటాన్‌తో చైనా చర్చలు జరుపుతోంది. చివరి సారి 2016లో చర్చలు జరగగా ఇప్పటికీ సమస్య పరిష్కారం కాలేదు. చైనా చేసిన ప్రకటనపై భారత్‌ నుంచి ఇప్పటికీ అధికారికంగా ఎటువంటి ప్రకటనా రాలేదు. చైనా చేసిన ఈ ప్రకటనతో చైనాతో భారత్‌కు ఉద్రిక్తతలు మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

More Telugu News