దేశంలో ఒక్కరోజులో 24,850 మందికి సోకిన కరోనా

05-07-2020 Sun 10:21
  • కరోనా కేసుల సంఖ్య మొత్తం 6,73,165
  • మృతుల సంఖ్య మొత్తం 19,268
  • 2,44,814 మందికి ఆసుపత్రుల్లో చికిత్స  
  • కోలుకున్న 4,09,083 మంది  
India reports the highest singleday spike of 24850 new COVID19 cases

దేశంలో కరోనా కేసుల విజృంభణ కొనసాగుతోంది. గత 24 గంటల్లో భారత్‌లో 24,850 మందికి కొత్తగా కరోనా సోకిందని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇప్పటివరకు నమోదైన కేసుల్లో ఇదే అత్యధికం. అదే సమయంలో 613 మంది కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు.
     
దేశంలో కరోనా కేసుల సంఖ్య ఇప్పటివరకు మొత్తం 6,73,165కి చేరగా, మృతుల సంఖ్య మొత్తం 19,268కి పెరిగింది. 2,44,814 మందికి ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 4,09,083 మంది కోలుకున్నారు.

నిన్నటి వరకు దేశంలో మొత్తం 97,89,066 శాంపిళ్లను పరీక్షించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న ఒక్కరోజులో 2,48,934 శాంపిళ్లను పరీక్షించినట్లు వివరించింది.