విక్టరీ వెంకటేశ్ 'నారప్ప' సినిమా నుంచి మరో పోస్ట‌ర్ విడుద‌ల‌.. సైకిల్‌పై కార్తీక్‌ రత్నం

Sun, Jul 05, 2020, 09:56 AM
narappa poster releases
  • నార‌ప్ప పెద్ద కొడుకు మునిక‌న్నా లుక్ విడుదల
  • మునికన్నా పాత్ర‌లో నటిస్తోన్న కార్తీక్ ర‌త్నం
  • ఆయ‌న పుట్టినరోజు వేడుక సంద‌ర్భంగా పోస్ట‌ర్
విక్టరీ వెంకటేశ్ హీరోగా రూపుదిద్దుకుంటోన్న నారప్ప సినిమా నుంచి మరో పోస్టర్ విడుదలైంది. నార‌ప్ప పెద్ద కొడుకు మునిక‌న్నా లుక్‌ను సురేశ్ ప్రొడక్షన్స్ తమ ట్విట్టర్‌ ఖాతాలో విడుద‌ల చేసింది. ఈ సినిమాలో ఈ పాత్ర‌లో కార్తీక్ ర‌త్నం న‌టిస్తున్నాడు.

ఈ రోజు ఆయ‌న పుట్టినరోజు వేడుక జరుపుకుంటోన్న సంద‌ర్భంగా ఈ పోస్ట‌ర్‌ను విడుద‌ల చేస్తున్నట్లు సురేశ్ ప్రొడక్షన్స్‌ తెలిపింది. సైకిల్‌పై కార్తీక్‌ రత్నం వెళ్తున్నట్లు ఉన్న ఈ పోస్ట‌ర్ అభిమానులను ఆకర్షిస్తోంది. కాగా, శ్రీకాంత్‌ అడ్డాల దర్శకత్వంలో నార‌ప్ప సినిమా రూపుద్దికుంటోంది.

తమిళ చిత్రం ‘అసురన్‌' ఆధారంగా సురేశ్‌ ప్రొడక్షన్స్‌, వవీ క్రియేషన్స్‌ పతాకాలపై ఈ సినిమా తీస్తున్నారు. ఈ సినిమాలో వెంకటేశ్ మధ్యవయస్కుడిగా నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాలోని ఆయన ఫస్ట్‌లుక్ విడుదలైంది. ఈ సినిమాలోని లుక్‌లు చిత్రంపై అంచనాలు పెంచేలా ఉన్నాయి.

X

Feedback Form

I agree to Terms of Service & Privacy Policy
Do you hate Fake News, Misleading Titles, Cooked up Stories and Cheap Analyses?...
We are here for YOU: Team ap7am.com
GarudaVega Banner Ad
Latest Video News..
Advertisement