ప్రకాశం జిల్లాలో కరోనా విజృంభణ.. 1000 మార్కు దాటేసిన కేసులు

Sun, Jul 05, 2020, 07:08 AM
Corona Virus Cases Crossed 1000 mark in Prakasam Dist
  • జిల్లాను కలవరపెడుతున్న కరోనా కేసులు
  • నిన్న కొత్తగా 41 మందికి సోకిన కరోనా
  • జిల్లాలో ఇంకా 667 యాక్టివ్ కేసులు
ప్రకాశం జిల్లాలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. నిన్న కొత్తగా 41 మంది ఈ మహమ్మారి బారినపడడంతో జిల్లా వ్యాప్తంగా నమోదైన కేసుల సంఖ్య 1,011కి పెరిగింది. కొత్తగా వెలుగుచూసిన కేసుల్లో అత్యధికంగా పామూరులో 12, చీరాలలో 11, ఒంగోలులో 6 నమోదయ్యాయి.

జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు 14 మంది కరోనాతో మరణించారు. అలాగే, ఇప్పటి వరకు 87,613 నమూనాలను పరీక్షలకు పంపగా, 84,774 ఫలితాలు నెగిటివ్ గా వచ్చాయి. 1,879 మంది ఫలితాలు రావాల్సి ఉందని అధికారులు తెలిపారు. జిల్లాలో ఇప్పటి వరకు 347 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ కాగా, 487 మంది ఇంకా క్వారంటైన్‌లో ఉన్నారు. 667 కేసులు యాక్టివ్‌గా ఉన్నట్టు అధికారులు తెలిపారు.

X

Feedback Form

I agree to Terms of Service & Privacy Policy
Do you hate Fake News, Misleading Titles, Cooked up Stories and Cheap Analyses?...
We are here for YOU: Team ap7am.com
GarudaVega Banner Ad