ఎన్టీఆర్ ‘గోల గోల’ పాటకు దుమ్మురేపిన జపాన్ జంట.. వీడియో ఇదిగో!

05-07-2020 Sun 06:49
  • 2006లో వచ్చిన అశోక్ సినిమా
  • అచ్చుగుద్దినట్టు ఎన్టీఆర్, సమీర డ్యాన్స్ స్టెప్పులను దింపేసిన వైనం
  • సోషల్ మీడియాలో వైరల్
Japanese couple dance to junior NTR Gola Song

ఎన్టీఆర్, సమీరారెడ్డి నటించిన ‘అశోక్’ సినిమాలోని ‘గోల గోల’ పాటకు ఓ జపాన్ జంట డ్యాన్స్ ఇరగదీసింది. మణిశర్మ సంగీత దర్శకత్వం వహించిన ఈ పాటకు ఎన్టీఆర్, సమీరారెడ్డి చేసిన డ్యాన్స్ అప్పట్లో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.  2006లో వచ్చిన ఈ సినిమా మ్యూజికల్ హిట్‌గా పేరు తెచ్చుకుంది.

ఇప్పుడీ సినిమాలోని ‘గోల’ పాటకు జపాన్ జంట చేసిన డ్యాన్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఎన్టీఆర్, సమీరల డ్యాన్స్ స్టెప్పులను అచ్చుగుద్దినట్టు దింపేశారు. క్యాస్ట్యూమ్స్‌ను కూడా దాదాపు అనుకరించారు. ఈ జంట డ్యాన్స్ చూసిన ఎన్టీఆర్ ఫ్యాన్స్ ముగ్ధులైపోయి ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఈ వీడియోను మీరూ చూడండి.