Allu Arjun: లాక్ డౌన్ లో లవ్లీ మూమెంట్స్... అల్లు అర్జున్ చేస్తున్నదిదే... వీడియో ఇదిగో!

Allu Arjun Busy in Lockdown
  • సెలబ్రిటీలందరూ ఇంటికే పరిమితం
  • భార్యా బిడ్డలతో అల్లు అర్జున్ కాలక్షేపం
  • ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో చిత్రాలు
కరోనా భయంతో సెలబ్రిటీలందరి మాదిరిగానే ఇంటికే పరిమితమైన హీరో అల్లు అర్జున్, చాలా బిజీగా ఉన్నాడు. అదేలెండి... ఇంట్లోనే... తన పిల్లలు అయాన్, అర్హలతో కాలక్షేపం చేస్తూ, ఒక్క నిమిషం కూడా ఖాళీ లేకుండా గడుపుతున్నాడు. సామాజిక మాధ్యమాల్లో ఎప్పటికప్పుడు తన చిత్రాలను అభిమానులతో పంచుకుంటూనే ఉన్నాడు.

భార్య స్నేహారెడ్డి, ఇద్దరు పిల్లలతో కలిసి ఇటీవలి కాలంలో అల్లు అర్జున్ ఎన్నో లవ్లీ మూమెంట్స్ ను పంచుకున్నాడు. వీటికి సంబంధించిన చిత్రాల సమాహారం నెట్టింట వైరల్ అవుతోంది. పిల్లలతో ఆడుకుంటూ, భార్యతో రోజులు గడుపుతూ ఇంట్లోనే ఉంటున్నాడు. ఇంకెందుకు ఆలస్యం? ఆ వీడియోను, అల్లు అర్జున్ కార్యకలాపాలను మీరూ చూసేయండి. 
Allu Arjun
Lockdown
Viral Pics

More Telugu News